\*ఓ పరాభావమా..................!
దిక్కులు పిక్కటిల్లెలా మార్మోగిన
మారణాయుధాల వికృత చేష్టలనాపి చేయూతనిచ్చి చేరదీయుమా
ఓ పరాభవమా...............!
రక్తపటేరులైన పురవీధులందు
తుదకు శేషంగా నున్న జనుల అర్తనాధాలు, అక్రందనలకు
ఆలంబనై నిలువుమా
ఓ పరాభవమా...............!
సామ్రాజ్యవాద రాబందుల
రెక్కల మోతకు చెల్లా చెదురై
తుదకు తట్టుకొని తపిస్తున్న పిన్న దేశాల పిల్లా జెల్లా
బిక్కు బిక్కుమంటూ నక్కి నక్కి
కూర్చున్న వారికి కూడు నందించి శాంత పరుచుమా...
ఓ పరభవమా.................!
ధనికస్వామ్య దాహర్తికి
దాసోహమైన తాడిత దేశాల
దుఃఖాన్ని తొలగించి, వారిదాహర్తిని తీర్చుమా.....
ఓ పరాభవమా.........
ఆయుధ వ్యాపారామనే చదరంగంలో
పావులుగా మారి చిద్రమైన
ఉక్రైన్, గాజా, ఇరాన్ ఉనికికి ఊతమివ్వుమా
ఓ పరాభవమా..................!
అహిసను వదిలి, హింసను ప్రేరేపిస్తూ
అశాంతికి ఆజ్యము పోసే
నోబెల్ శాంతి బహుమతి కాంక్షించి
భగపడి శాంతికి పాతరేసే కర్కోటకులను కాలరాయుమా
ఓ పరాభవమా.......................!
పరులు పచ్చగుంటే
భరించలేని బహుపాత్రదారులు
ప్రపంచ దేశాలపై చూపే
ప్రతాపాన్ని పాతరేయుమా..
ఓ పరాభవమా..................!
ప్రపంచానికి పెద్ద మనిషి
పరికించక పడుకున్నాడేమో నిద్రలేపుమా .....
ఓ పరాభవమా...................!
కాన తక్కిన దేశాలొక్కటై
తనివితీర సమీక్ష చేసి
దుష్టుల దుర్మార్గాలని, కల్ల బొల్లి కబుర్లన్ని
కాలాకూట విషమని
సకల దేశాలకు
విషదపరిచి చాటి చెప్పుమా
ఓ పరాభవమా....................!
పోరునాప ప్రపంచమొక్కటై అహింస, అశాంతిని
ఆటకెక్కించి, ప్రపంచశాంతిని
నెలకొల్ప ఆదినుండవా... ఆదుకోవా.....
ఓ పరాభావమా....................!
లేకపోతే... భావితరాల భవిషత్తు
ఇక బడబానలమే..., బడభాగ్నే .
అందుకే అనాడే అందరికంటే ముందుగా ప్రవచించెను తన సొంత జీవితాధారంగా
పోరు వద్దని విశ్వశాంతి కోరుతూ,
అందరు బాగుండాలని,విశ్వ నరుడుగా
విఖ్యాతి పొందిన, తధాగతుడు గౌతమ సిద్దార్థుడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి