పాలవ్యాపారి విజయం: -S. శశి కుమార్,-8/బి,-TGTWURJC (B) IBP.-కథా శిక్షణ&పర్యవేక్షణ:-Dr దుగ్గి గాయత్రి రంగరాజు
 అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రంగాపురం . ఆ గ్రామంలో లింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను పాల వ్యాపారం చేసేవాడు. అతనికి మూడు ఆవులు ఉండేవి. అందులో ఒక ఆవు 15 లీటర్ల వరకు పాలు ఇచ్చేది. దాని పేరు లక్ష్మి. ఈ ఆవు ఇచ్చినంతగా ఇంకా రెండు ఆవులు పాలు ఇచ్చేవి కాదు. ఈ రెండు ఆవులు 5 నుండి 6 లీటర్ల వరకు మాత్రమే ఇచ్చేవి. అతను రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఆవుల నుండి పాలు తీసుకొని గ్రామంలోకి వెళ్ళి అందరికి పాలు అమ్మేవాడు. అతను రోజు 25లీటర్ల వరకు పాలు అమ్మేవాడు. అతను పాలలో నీళ్ళు కలిపేవాడు కాదు. అతను అన్ని చిక్కని పాలే అమ్మేవాడు. దగ్గర ప్రజలందరు పొలు కొనేవారు. అతను అందుకని అతను తన ఆవులను చాలా బాగా చూసుకునేవాడు, రోజు గడ్డి వేసేవాడు . ఉన్నట్టుండి ఒక రోజు తను ప్రాణంగా చూసుకునే లక్ష్మికి భయంకరమైన జబ్బు వచ్చింది, ఆ జబ్బు నయం కావడానికి డబ్బు అవుతుందని  తెలిసి అతను ఆ ఆవును అడవిలో వదిలేసాడు. అప్పటి నుంచి అతనికి రెండు ఆవులు ఇచ్చే పాలు సరిపోయేది కాదు. అందుకని అతను ఇంకొక ఆవును కొన్నాడు. అయినా కూడా లక్ష్మి ఇచ్చే అంతగా ఇందులో ఒక్క ఆవుకూడా పాలు ఇచ్చేది కాదు. అందుకని అతనికి అమ్మడానికి పాలు సరిపోయేవి కాదు, అందుకని అతను పాలల్లో నీళ్ళు కలపడం ప్రారంభించాడు. అప్పుడు అది తెలిసిన ప్రజలు అతని దగ్గర పాలు కొనడం ఆపివేసారు. అందుకే అతనికి పాలగిరాకి కూడా తగ్గింది. అప్పుడు అతనికి అతను చేసిన తప్పు తెలిసింది. " అరే నేను అప్పుడు లక్ష్మిగాని దగ్గర తీసుకొని దానికి వచ్చిన జబ్బును నయం చేసి ఉంటే నాకు ఇంకా డబ్బులు వచ్చేవి "అని బాధపడి అప్పుడు అతను ఇంక రెండు ఆవులను కొని మళ్ళీ చిక్కని పాలు అమ్మడం ప్రారంభించాడు .అప్పుడు అతనికి చాలా గిరాకి వచ్చింది.

నీతి:- పశువులకు జబ్బు వచ్చిందని అడువులలో వదిలేయకుండా వాటిని మన కుటుంబ సభ్యుల్లాగ దగ్గరకు తీసుకొని వాటికి వచ్చిన జబ్బును నయం చేయాలి.



కామెంట్‌లు