పెద్దలు చెప్పిన మాట వినాలి.: - S. గణేష్(s /o)మైబు-8/B-TGTWURJC(B)IBP.-పర్యవేక్షణ&శిక్షణ: Dr దుగ్గి గాయత్రి రంగరాజు
 అనగనగా పెద్దాపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్యకు ఒక కుటుంబం ఉండేది. రామయ్యకు రాజు అనే ఒక కొడుకు ఉండేవాడు. రాజు చాలా తెలివైన పిల్లాడు. ఒక రోజు అన్నం తింటుండగా ఒక ఎలుకను చూస్తాడు . ఆ ఎలుక రాజుని చూసి భయపడి పారిపోతుంది. రాజు తరువాత ఒక రోజు పిల్లిని తెచ్చుకుంటాడు. రాజు పిల్లికి పాలు మరియు బిస్కెట్ పెడుతాడు. అప్పుడు, ఎలుక గర్భవతి  చూస్తు చూస్తునే నెలలు గడిచాయి . ఎలుకకు నాలుగు ఎలుక పిల్లలు పుట్టాయి. అవి కొంచం పెద్దగా ఉన్నాయి. "పిల్లి"పిల్లికి పాలు, బిస్కెట్లు తిని తిని విసుగు వచ్చింది . పిల్లి బయటికి వెళ్తున్నప్పుడు తల్లి ఎలుకను చూస్తుంది . ఆ ఎలుకలు పిల్లిని  చూసి భయపడి పారిపోతుంది. అప్పుడు పిల్లి ఇళ్ళు మొత్తం తిరిగి చూస్తుంది. దానికి ఒక కన్నం కనబడుతుంది. అందులో ఏముందని చూస్తే ఏమి  కనబడదు. ఎందుకంటే కన్నం మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. పిల్లి లైటును తెచ్చి చీకటిగాఉందని వెళ్ళిపోతుంది అప్పుడు తల్లి ఎలుక వచ్చి కన్నంలోకి వెళ్ళి, తన పిల్లలకు  చెబుతుంది,ఏమని అంటే పిల్లలు ఈ ఇంటివాళ్ళు ఒక పిల్లని పెంచుతున్నారు  అని అంటుంది. సరే అమ్మ అని ఎలుక పిల్లలు చెప్పుతారు. పిల్లలు మీరు ఇక్కడే ఉండండి . నేను వెళ్ళి ఆహారం తెస్తాను అని అంటుంది. ఎలుకలు సరే అని అంటాయి . తల్లి ఎలుక బయటికి వెళ్తుంది. అప్పుడు పిల్లి లైటును తీసుకొని వచ్చి అ కన్నంలో లైటు  వేస్తుంది . ఆ కన్నంలో ఎలుకలు
ఉంటాయి.  అప్పుడు పిల్లి వెన్న ముద్దను ఆ కన్నం ముందల పెట్టి పక్కన ఉన్న గోడ వెనక దాక్కుంటుంది. ఆ వెన్నముద్దను చూసి ఎలుకలు ఉన్న ఆగకుండ  వెళ్తాయి. మిగతా ఎలుకలు వద్దు వెళ్ళకండి అమ్మ బయటికి, వెళ్ళవద్దు అని చెప్పింది అయినా సరే రెండు ఎలుకలు వినకుండా వెళ్ళాయి. సమయం చూసి పిల్లి ఆ రెండు ఎలుకలను చంపి తింటుంది.
నీతి :- అమ్మ, నాన్న ఇంకా గురువులు మన మంచి కోసమే చెపుతారు. మనం వాళ్ళ మాటలు వినాలి లేకపోతే మనం చెడు మార్గం లో పోతాము.


కామెంట్‌లు