అనగనగా కోటపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఇద్దరు రాజు, తేజు అనే స్నేహితులు నివసించేవారు. వాళ్లు ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. వాళ్ళు ఇద్దరు ఒకరి మాటకు ఒకరు కట్టుబడి ఉండేవారు . వాళ్ళు ఇద్దరు డిగ్రీ చదువుతున్నపుడు రాజుకు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది . ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక పెద్ద ఉద్యోగస్థుడు . వాళ్ళు ముగ్గురు కలిసి ఉండేవారు. రాజు ఎప్పుడు ఎక్కువగా ఆ అమ్మాయితోనే తిరుగుతున్నాడు తేజు మాట వినటంలేదు. రాజు క్రమంగా హద్దు దాటినట్లు అనిపిస్తున్నాగాని తేజు అవన్నీ పట్టించుకోడు . అలాగే ఒక రోజు వాళ్ళు ముగ్గురు వాళ్ళ గ్రామం ప్రక్కనున్న పార్కుకు వెల్దామని అనుకుంటారు. అలాగే వెళ్తారు కానీ పార్కు లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి.రాజు దగ్గర ఒక్క రూపాయి కూడ ఉండదు .ఆ అమ్మాయి దగ్గర కూడ డబ్బు ఉండదు కాని తేజ దగ్గర మాత్రం 50 రూపాయలు ఉంటాయి. టికెట్ ఒక్కటి 20 రూపాయలు రాజు, తేజ ఇద్దరు రెండు టికెట్లు తీనుకుంటారు. ఆ అమ్మాయికి ఇంక పదియాపాయలు లేవని తేజు తన కాళ్లకున్న కొత్త చెప్పులను పదిరూపాయలకు అమ్మి ఇంకొక టికెట్ తీసుకుంటాడు ముగ్గురు పార్కు లోపలికి పోయిన తరువాతి రోజు ఇంక ఆ అమ్మాయి.తేజుకంటే రెండు అడుగులు ముందుంటారు. అప్పుడు తేజు కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. అరే రాజు ఆగరా అంటాడు తేజు వినిపించుకోడు రాజు ముందుకు వెళ్తాడు. తేజు అరేయ్ నీకు నేను ముఖ్యమా? అమ్మాయి ముఖ్యమా? అంటాడు. అమ్మామే కావాలంటాడు. రాజు అరే రాజు నాతో ఇంకెప్పుడు. మాట్లడవు కదా అంటారు తేజు . హే పోరాపో అంటాడు .రాజు ఎంతో మనస్తాపం చెంది అక్కడి నుండి వెళ్ళి పోతాడు.మరుసటి రోజు
ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు U.S.Aకి బదిలీ అవుతుంది వాళ్ళ నాన్న ఆ అమ్మాయి వెళ్ళిపోతారు.రాజు తన ప్రవర్తన వల్ల తేజు వంటి మంచి స్నేహితుడిని కోల్పోతాడు.ఒంటరిగా మిగిలిపోతాడు.
నీతి: - ఒకటి వచ్చిందని మరొకటి పదిలివేస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది.
ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకు U.S.Aకి బదిలీ అవుతుంది వాళ్ళ నాన్న ఆ అమ్మాయి వెళ్ళిపోతారు.రాజు తన ప్రవర్తన వల్ల తేజు వంటి మంచి స్నేహితుడిని కోల్పోతాడు.ఒంటరిగా మిగిలిపోతాడు.
నీతి: - ఒకటి వచ్చిందని మరొకటి పదిలివేస్తే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి