సన్డే సాధన సూత్రాలు-100: - సాधNa-సాధన.తేరాల,ఖమ్మం.
చూడు మామ.....

చుట్టూ పరికించి చూస్తే...
వెన్నుపోట్లు ,
నమ్మకద్రోహాలు ఎన్ని లేవు!
అన్నింటిని తట్టుకుని 
నిలబడ్డావు.
మోసాలు, వంచనలు ఎన్ని చూడలేదు!
అన్నింటిని దాటుకుని తేరుకున్నావు.

నీ నుండి లాభం పొంది, 
నీ వెనుక గోతులు తీసిన గుంటనక్కల 
స్వభావాలు తెలియజేసి,
మంచితనం అనే ఊబి నుండి 
నిన్ను లాగి ఇవతల పడేసి...
నిన్ను నీకు మిగిల్చిన వారికి కృతజ్ఞతలు చెప్పి ( మనసులో ), 
వారికి దూరంగా దర్జాగా జీవించు, సుఖీభవ.
_____

నేటితో శతకం పూర్తి, ఆదరిస్తున్న అందరికి శతకోటి వందనాలు 🙏😊.

కామెంట్‌లు