విజయవాడలో 18 , 19 తేదీల్లో ఘనంగా అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం

 ఆకట్టుకోనున్న సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు 
పోగ్రామ్ డైరెక్టర్ డా.యు.వి రత్నo 
జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి 

అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 135 వ జయoతి వేడుకలులో భాగంగా  కవులు కళాకారులు  సాహితీ సంస్థల నిర్వాహకులను  గుర్తించి అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారంతో ఘనoగా సత్కారం చేయనున్నారు. అలనాటి మధురమైన పాటలతో పాటు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకొనున్నాయని పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి తెలియజేసారు. రంగస్థల కళాకారులను గుర్తిస్తూ ప్రోత్సాహకంగా అవార్డుతో గౌరవిస్తూ కళారంగాన్ని ముందుకు తీసుకోవడమే లక్షoగా ముందుకు సాగుతున్నామనీ మేనేజింగ్ డైరక్టర్ డా. యు. వి రత్నo తెలియజేశారు. విజయవాడ కౌత పూర్ణానంద వేదిక గాంధీనగర్ లో జరిగే కార్యక్రమంలో 100 మంది కవులు కళాకారులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి రానున్నారని తెలియజేశారు. ముఖ్య అతిథిగా అడిషనల్ రీటైడు ఎస్పీ  మురళీ కృష్ణ పింగళి లేఖ్య అన్నపూర్ణ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనువరాలు మరియు తాళ్ళపల్లి శ్రీనివాస్ గోదావరి ఆంధ్ర సొసైటీ చైర్మెన్ డా .వి.డి. యస్ ప్రసాదు రిటైర్డ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యస్ యస్ సత్య తాళ్లూరి రామారావు ముఖ్య అతిధులుగాను విచ్చేయనున్నారు. కార్యక్రమంను 24 గంటల రికార్డు సర్టిఫికేట్ తోపాటు డా. అంబేద్కర్ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్టు నిర్వాహకులు డా. యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి  జాతీయ అధ్యక్షురాలు పోగ్రామ్ డైరెక్టర్ తెలియజేసారు.
కామెంట్‌లు