కర్ణపర్వం 2...అచ్యుతునిరాజ్యశ్రీ

 తెల్లారాక యుద్ధ భూమిలో ధర్మరాజు దుర్జయవ్యూహం, రచించాడు. ధృతరాష్ట్రుడు  బాధ పడసాగాడు.రోజులు గడుస్తున్నాయి. 16రోజుల యుద్ధంలో కౌరవ యోధులు మరణిస్తే పాండవుల బలం చెక్కుచెదరలేదని తెగ బాధ పడసాగాడు.పాండవులకు దైవ బలంఉందని ఇప్పుడు బాగాబుర్రకెక్కింది ఆవృద్ధునికి. కర్ణుని అండ చూసుకు కొడుకు విర్రవీగుతున్నాడని తెలుసు.తనబాధను సంజయునితో చెప్తే ఆయన ఇలా అన్నాడు" నీది స్వయంకృతాపరాధం.కొడుకులకి తందానతాన అన్నావు."కర్ణుడు దుర్యోధనునితో" మిత్రుడా! నాదగ్గర విజయము అనే ధనస్సుంది. అది అర్జునుడి గాండీవంతో సమానం.నాకు శల్యుడు రథసారధిగా ఉండాలి.కృష్ణునితో సమానంగా రథం నడపగలవాడు అతనొక్కడే"సుయోధనుడు వెళ్లి శల్యుని ప్రార్ధిస్తాడు. అంతే అతను కోపంతో తోక తొక్కినత్రాచులాగా బుస్ మన్నాడు. "ఆసూతుడికి సారధిగా ఉండమనటానికి నీకెన్ని గుండెలు??" " శల్యా! అశ్వశాస్త్రంలో నీవు కృష్ణుని మించిన వాడవు.సారధ్యం చేయటం నీచకార్యంకాదు.త్రిపురాంతక వృత్తాంతం చెప్తాను.విని ఆలోచించు" అని దుర్యోధనుడు చెప్పాడు🌹
కామెంట్‌లు