వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
66.సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా (షోడశాక్షరీ)
67.అశ్వరూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా (షోడశాక్షరీ)
అరవై ఏడవ నామ మంత్రము -
ఓం అశ్వరూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః
ఈ చరాచర జగత్తులో మానవుల ఇంద్రియాలు అనే గుర్రాలను తన అదుపులో ఉంచుకోగలిగే దేవి, "అశ్వారూఢా దేవి" ఎక్కి కూర్చున్న అనేక గుర్రముల ళ్రేణుల చేత ఆవరించబడి, ఆ అశ్వముల గుంపు మధ్యలో దర్శనమిచ్చిన పరమేశ్వరిని చూచిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "అశ్వరూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా" అని కీర్తించారు. మన ఇంద్రియాలను తన అధీనంలో వుంచుకుని, మనల్ని కరుణతో అక్కున చేర్చుకునే "చిదగ్నికుండ సంభూత" కు నమస్కారము.
ఈ "అశ్వారూఢా దేవి" అనుగ్రహము పొందగలిగిన, ఋషులు, మునులు, తాపసులు, యోగి పుంగవులు ఇంద్రియముల ద్వారా ఏర్పడే కోరికలు అనే గుర్రాలు వారి అదుపులో ఉండి, ఇంద్రియ దౌర్బల్యానికి దూరంగా ఉంటూ, శాశ్వాతమైన, పరమేశ్వరిని తెలియజేసే జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, నిత్యమూ, సత్యమూ అయిన "ఆత్మానందాన్ని" పొందుతారు.
భండాసురుని సంహారానికి సిద్ధంగా ఉన్న సేనలో, గజదళానికి "సంపత్కరీ దేవి" అధిదేవత గా ఉంటే, ఆ సేనలోని అశ్వదళానికి "అశ్వారూఢా దేవి" సారధ్యం వహిస్తోంది. సంపత్కరీ దేవి - అమ్మ అంకుశం నుండి ఉద్భవిస్తే, అశ్వారూఢా దేవి - అమ్మ యొక్క పాశము నుండి ఉద్భవించింది. వీరిలో ఎక్కువ తక్కువలు ఎలా నిర్ణయించగలము.
ఈ అశ్వారూఢా దేవి, "అపరాజిత" అనే గుర్రమును అధిష్టించి, అశ్వసేనలో వున్న వివిధ జాతుల అశ్వాల గమనాన్ని తన కనురెప్పల సైగలతో నిర్ణయించగల శక్తి కలిగివుంది. శ్రీ సూక్తం లో మనం అమ్మ యొక్క పారాయణ చేస్తూ "అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్" అని చెప్పుకుంటాము కదా. అంటే, అశ్వారూఢా దేవి తన అశ్వదళముతో అమ్మ ముందు నడుస్తూ ఉంటే, ఏనుగుల, అశ్వాల దళముల మధ్యలో భండాసురుని సంహారానికి కదలి వెళుతున్నదన్నమాట, శ్రీమన్మహారాజ్ని.
ఇంత శక్తివంతమైన సేనల కూర్పుతో దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ కోసం కదిలే పరాత్పరిని పూజించేటప్పుడు
ఓం అశ్వరూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి