వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
67.అశ్వరూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృతా (షోడశాక్షరీ)
68.చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా (షోడశాక్షరీ)
అరవై ఎనిమదవ నామ మంత్రము -
ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః
ముప్పది ముక్కోటి దేవతల నుండి లభించిన అన్ని ఆయుధములతో చుట్టబడివున్న చక్రరాజము అనే రథాన్ని అధిరోహించి కనిపించిన లలితా పరమేశ్వరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా" అని కీర్తించారు. అలా అన్ని ఆయుధములతో చుట్టబడివున్న చక్రరాజము లో, రాక్షస సంహారం చెయడానికి సిద్ధమై కనిపిస్తున్న పరాత్పరికి నమస్కారము.
"శ్రీచక్రము"ను మించిన చక్రము ముల్లోకాలలో లేదు. అందుకనే శ్రీచక్రమును "చక్రరాజము" అన్నారు. ఈ చక్రరాజము ను శ్రద్ధా భక్తులతో పూజించిన వారి అన్ని కష్టాలను, బాధలను, పాపాలను తొలగించి వేస్తుంది. అన్ని సౌభాగ్యాలను అందరికీ ఇవ్వగలిగినదీ, ఈ "శ్రీచక్రం". కానీ, శ్రీవిద్యా ఉపాసన, శ్రీచక్ర అర్చన అందరికీ సులభంగా అందే విద్యలు కావు. లలితా పరాభట్టారిక అనుగ్రహం ఉంటే నే, ఇవి సాధ్యమౌతాయి. అంత గొప్పదైన, శక్తివంతమైన "చక్రరాజము" అనే రథము అని విధాలైన ఆయుధాలతో నిండి వుండగా, శ్రీమాత రిపు సంహారము చేసి తన భక్తులను, అనురక్తి తో రక్షించడానికి సిద్ధంగా ఉన్న అమ్మ దర్శనం, ఈ మంత్రం లో మనకు కనబడుతుంది.
ఈ శ్రీచక్ర చక్రరాజ రథము లో, మనలో వున్న అజ్నానము అనే శతృవును తన అదుపులోకి తీసుకుని, మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి అవసరమైన ఆత్మగుణ సూచితముగా వున్న అన్ని రకాల ఆయుధాలు వున్నాయి. మనం చెయవలసిన వేద విధులకు భంగం కలిగించే అన్ని చెడు గుణాలను చెరబట్టి, అణచివేసి, మనల్ని తన చింతామణి గృహానికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టడానికి, అమ్మ, మనకోసం సిద్ధంగా ఉంది.
*సాధకులకు అమ్మ పెట్టే పరీక్షలు వింతగా, విపరీతంగా అనిపించి, మనలోని పరమేశ్వరి పైన ఉన్న ఆలోచనల నుండి దూరంగా దారి మళ్ళించేవిగా ఉంటాయి. అంతమాత్రాన, తన దారి వదిలిపెట్టకుండా, అచంచలంగా నిలబడాలి. మూలాధార చక్రాలలో సహస్రారచక్రం బ్రహ్మరంధ్ర స్థానంలో మానవ ప్రజ్నకు అతీతంగా నిలబడి వుంటుంది. బిందు రూపంలో ఉన్న అమ్మను చేరుకోవాలి అని అమ్మను పూజించేటప్పుడు
ఓం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి