వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
71.జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా (షోడశాక్షరీ)
72.భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా
(షోడశాక్షరీ)
డెబ్బై రెండవ నామ మంత్రము -
ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః
భండాసురుని, అతని సైన్యాన్ని తుదముట్టించడానికి సిద్ధంగా ఉన్న శక్తి సేనలను చూసి శౌర్యానందానుభూతిని పొందుతున్న పరమేశ్వరి ని చూసిన వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితా" అని కీర్తించారు. అలా భండాసురుని తో యుద్ధం చెయ్యాలి, వాని సేనతో పాటు ఆతనిని కూడా అంతమొందించాలని ఉత్సాహంగా ఉన్న తన సేనల ప్రతాపాన్ని చూస్తూ సంతోషిస్తున్న లలితా పరాభట్టారికకు నమస్కారము.
భండాసురుడు, దేహం వేరు, పరమాత్మ వేరు అని నమ్మి జీవిస్తున్న వాడు. అంటే, జీవాత్మ పరమాత్మ ఒక్కడే అని చెప్పే అద్వైతాన్ని నమ్మనివాడు. ఇతడు రాజు. మరి అతని పౌర సమాజం.....యథా రాజా తథా ప్రజా.....అనే చందంగానే ఉన్నారు. అందుకనే, ఆత్మజ్ఞానం లేక, ఈ చరాచర జగత్తులో కంటికి కనిపించేది మాత్రమే నిజం, మిగిలిన విషయాలు అన్నీ భ్రమ మాత్రమే అనుకుంటున్నారు. అందువల్లే, తనే నిజమనే బాహ్యప్రవృత్తిని నమ్మి ఇతరులను బాధలకు గురిచేయడం చేస్తున్నారు, భండాసురుడు, అతని సైన్యం.
ఇప్పుడు జరగాల్సింది పైన చెప్పిన ఆలోచనలతో మలినమైపోయిన మనసు యొక్క ప్రక్షాళన. రాక్షసులు కాబట్టి, మాటలతో పని జరగదు. పైగా, పండు పక్వానికి వచ్చింది. రాలవాలసిందే. సస్వరూప జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారం చేయించడానికి, అద్వైత శక్తులు తమ సంసిద్ధతను తెలియజేస్తూ....యుద్ధోత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి.
*అలా కదనోత్సాహంతో కదులుతున్న జ్ఞానశక్తులను చూసి సహస్రచంద్ర కాంతులతో దర్శనం ఇస్తున్న శ్రీమాత ను పూజించేటప్పుడు
ఓం భండసైన్య వధోద్యుక్త శక్తివిక్రమ హర్షితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి