మన తెలుగు భాష,తృతీయ అక్షరం ఇ.మన ఇల్లు హరివిల్లు ,ఆనందాల పొదరిల్లు!ఇంటి కొచ్చిన వారిని, ఆప్యాయంగా ఆదరిద్దాం!ఇంట గెలిచి ,మరి రచ్చ గెలుద్దాం!ఇంగువ కట్టిన,గుడ్డలా పరిమళిద్దాం!ఇల సుందర స్వర్గం ,మనమే నిర్మిద్దాం!ఇక్కడే అన్నీ ,ఉన్నాయని నిరూపిద్దాం!ఇరువురి మధ్య,ఐకమత్య ఐశ్వర్యం సృష్టిద్దాం!ఇష్టం ఎంత కష్టమైనా,సాధించి జీవిద్దాం!ఇహమే పరానికి,సోపానం అధిరోహిద్దాము!ఇక పోరాటాలకి స్వస్తి,పలుకుదాం!బంగారం కొనేవాళ్లు కొనండి,పై ఆచరణలూ ఆచరించండి!రాబోయే అక్షర తృతీయ,మీరే కాబోయే ప్రథములు!__________
దశ ఆచరణలు!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 94410 58797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి