హే మాలిక్! నీ సేవకులం! హే ప్రభో! నీ వాళ్ళం!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 9441058797
 1.
సదా మమ్మల్ని రక్షిస్తావు!
నీపై విశ్వాసంతో నడిపిస్తావు! 
మాచే సత్కర్మలు చేయిస్తావు! 
చివరి క్షణంలో నవ్వనిస్తావు! 
జీవన ప్రయాణం ముగిస్తావు! 
2.
మా చుట్టూ అలుముకున్న, 
ఘన అంధకారం! 
మా మనసు చేస్తున్నది
 తీవ్రఆహాకారం! 
ఆశ సూర్యుడికి ,
పట్టే ,పూర్ణగ్రహణం! 
నీవు తలిస్తే అమావాస్య,
నిండు పున్నమి! 
పట్టు తప్పే వేళ ,
నీవు చేయి పట్ట బలిమి!
3.
జీవన రథం ధర్మ పథం!
 అపకారం ఎదురైన సందర్భం! 
ప్రేమతో ముందడుగు వేయడం!, 
అపకారం సిగ్గుతో తలవంచడం! 
సత్యం,ధర్మం తోడుగా నిలవడం!
4.
యుగాలు మారిన వేళ,
 మనిషి నైజం మారడం సహజం! 
కలియుగాన జీవితాన,
ఆత్మబలం అత్యవసరం! 
చెక్కుచెదరని మనోధైర్యం,
సమస్యల సమాధానం! 
దుర్లభమైన మానవజన్మ, 
కారాదు పునర్జన్మ కారకం! 
ఆర్తులం, అర్ధులం, జిజ్ఞాసులం,
నీ అనుగ్రహంతో జ్ఞానులం! 
__________

కామెంట్‌లు