శ్లో!! మధ్వయం భద్వయం దైవ బ్రత్రయం వచతుష్టయం,
అనాపలింగ కూస్మాని పురాణాని ప్రచక్షతః అని ఈ శ్లోకం అష్టాదశ పురాణాల గురించి వివరిస్తుంది.
మద్వయం(2) 1. మత్స్య పురాణం.2). మార్కండేయ పురాణం.
భద్వయం(2) 1. భాగవత పురాణం. 2.భవిష్య పురాణం
బ్రత్రయం(3).1. బ్రహ్మపురాణం.
2. బ్రహ్మాండ పురాణం. 3.బ్రహ్మవైవర్త పురాణం.
వచతుష్టయం(4). 1. వరాహ పురాణం 2. వామన పురాణం.
3. వాయు పురాణం 4.విష్ణు పురాణం.
అనాపలింగ (5).1. అగ్ని పురాణం 2.నారద పురాణం 3.పద్మ పురాణం.4. లింగ పురాణం 5.గరుడ పురాణం.
కూస్మా(2).1. కూర్మ పురాణం
2. స్కాంద పురాణం.
1. మత్స్య పురాణం
------------------------
మత్స్యవతారమెత్తిన విష్ణువుచే ధర్మాచరణములు కాశి ప్రయాగ వంటి పుణ్యక్షేత్ర మహత్యములు మనువునకు చెప్పబడినవి చెప్పబడినవి.
2). మార్కండేయ పురాణం
--------------------------------
మార్కండేయునిచే శివ కేశవులమహాత్ములు, చంద్రార్కాగ్నుల మహత్యములు, పద్మశాలీయ వంశోద్భవము, హోమ విధానములు చెప్పబడినవి.
3). భాగవత పురాణం
----------------------------
ఇందులో వేద వ్యాసుడు, శుకునకు, శుకుడు పరీక్షిత్ మహారాజుకు, మహావిష్ణువు అవతారాల గూర్చి శ్రీ కృష్ణుని లీలల గూర్చి చెప్పబడినది.
4) భవిష్య పురాణం
---------------------------
ఇందులో సూర్యుడు మనువుకు రాబోవు కాలమును అనగా భవిష్యత్ కాలమును గూర్చిన విషయములను చెప్పుట జరిగినది.
5) బ్రహ్మా పురాణం
----------------------------
ఇందులో బ్రహ్మచే దక్షిణకు శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపాదుల చరిత్రలు, ధర్మాచరణములు, స్వర్గ నరకాలను గూర్చి చెప్పబడినది.
6) బ్రహ్మాండ పురాణం
-----------------------------
ఇందులో బ్రహ్మచే మరీచికి పరుశరామ, శ్రీరామ, ఖగోళ శాస్త్ర చరిత్రలు, లలితా సహస్రనామ స్తోత్రాలు చెప్పబడినవి.
7) బ్రహ్మ వైవర్త పురాణం
---------------------------------
ఇందులో సావర్నునిచే నారదునకు గణేశ, రుద్ర, సృష్టికర్త, కృష్ణుల, పంచ శక్తుల ప్రభావమును గురించి చెప్పబడినది.
8) వరాహ పురాణం
--------------------------
ఇందులో వరాహ అవతారం ఎత్తిన విష్ణుచే భూదేవికి పార్వతీ పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు చెప్పబడినవి.
9) వామన పురాణం
----------------------------
పురుషోత్తమా ఋషి నారదునికి శివలింగోపాసన, శివపార్వతుల కళ్యాణం, గణేశ, కార్తికేయ, భూగోళ, ఋతువుల గూర్చి చెప్పబడినది.
10) వాయు పురాణం
-----------------------------
ఇది వాయు దేముంచే శివ మహాత్యం, సౌర మండల వర్ణనలు చెప్పబడినవి.
11) విష్ణు పురాణం
--------------------------
ఇది పరాశరుడు తన శిష్యుడగు మైత్రేయునికి విష్ణు, కృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు చెప్పబడినవి.
12) ఇందులో అగ్నిదేవుడు వశిష్టునకు శివ, గణేష, దుర్గ, వ్యాకరణ, చందస్సు, జ్యోతిష్య, వైద్య, లౌకిక, రాజకీయ, భూగోళ శాస్త్రాలను గురించి చెప్పబడినవి.
13) నారద పురాణం
----------------------------
సనక, సనంధనాధులకు అతి ప్రసిద్ధి చెందిన శివ స్తోత్రం, వేదాంగములు, వ్రతములు, బదిరి, కాశి ప్రయాగ వంటి క్షేత్రంలో గూర్చి చెప్పబడినది.
14) పద్మ పురాణం
--------------------------
దీనిని పట్టించిన లేదా వినిన మాత్రములనే జన్మజన్మాంతర పాపాలు తొలగును. 18 పురాణాలలో ఎక్కువ శ్లోకములు
(85 వేలు) గల పురాణం ఇది. బ్రహ్మ సృష్టికర్యం, గాయత్రి, గీత, గంగ, విభూతి, మాఘ స్నానం మహత్యములు, పూజా విధానములు చెప్పబడినవి.
15) లింగ పురాణం
--------------------------
ఇందులో శివుని ఉపదేశములు, లింగ రూప శివ మహిమ, శివ పూజా విధానములు చెప్పబడినవి.
16) గరుడ పురాణం
---------------------------
ఇది విష్ణువుచే గరుత్మంతునికి జీవి జనన మరణములు, స్వర్గ, నరక ప్రయాణములు చెప్పబడినవి.
17) కూర్మ పురాణం
--------------------------
ఇందులో కూర్మ, వివాహ, నారసింహ అవతారములు, లింగరూప శివారాధన, భూగోళ, ఖగోళ, కాశి, ప్రయాగ వర్ణనలు విష్ణువుచే చెప్పబడినవి.
18) స్కాంద పురాణం
-----------------------------
ఇది కుమారస్వామిచే శివ చరిత్ర, ప్రదోష స్తోత్రములు, కాశి, రేవా ఖండం, కేదారేశ్వర వ్రతకల్పము, వైష్ణవ, ఉత్కళ, కుమారిక, బ్రహ్మ, బ్రహ్మోత్తర, అవంతిక కండములను గూర్చి చెప్పబడినది.
ఈ అష్టాదశ పురాణములు వేద వ్యాసునిచే నైమిశారణ్యమునందు రచించబడినవి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి