ఓ తల్లి ఆవేదన !: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977.
బబ్బి నిన్నేమన్నా అన్నామా ?
తబ్బిబ్బై నిన్నే మేం కన్నామా ?
మాకు ఓ మాట నీవు చెప్పకుండా
మా మాట అసలే ఇక వినకుండా
వెళ్ళిపోయావా ఆ దైవ సన్నిధికి
దూరమైనావా మా ప్రేమ పెన్నిధికి
మా గుండెలో మరి బాధను పెంచి
ఆ దైవానికి నీవు ఇక నీ తలవంచి

బబ్బి నీ ముద్దు ముద్దు మాటలకే మేం ఉబ్బి
సంతోష సాగర మందు మునిగి తేలినాము
సరిగమపదనిసలంటూ పాట పాడినాము
నీతో నిత్యం మేము కూడి ఆడినాము !

బబ్బి నీ నవ్వులే పువ్వులై పూచిన వేళ
కడుపుబ్బి ఉదరం చెక్కలై పోయెను చాలా
అందుకే ఆ దేవుడు కొనిపోయెను నిన్ను
ముందుగానే తానేశెను మాపై సీత కన్ను !

అల్లారు ముద్దుగా పెంచుకుంటిమి
ఎల్లరు మెచ్చేలా  చూసుకుంటిమి
మా సర్వస్వం ఇక నీవే అనుకొని
నీవు లేక ఇల మేమిక బ్రతకమని
ఆ దైవానికి విన్నవించుకుంటిమి
ఇల ఇక మేము ఒంటరై ఉంటిమి!

రేయి రేయి మా కలలోకి వస్తున్నావు
దాయి దాయి మా అని అలరిస్తున్నావు
ఆ రేయికి మాత్రమే మాకు ఆ సంతోషం
తెల్లారితే మిగులుతుంది మాకు సంతాపం!

నిన్ను మరవలేక పోతున్నాం మేము
మిన్ను విరిగి మీద పడిన చేస్తాం సాము
నీకోసం ఆ దేవుడినైనా మేం ఎదిరిస్తాం
సచ్చి చెడైనా నీ సముఖమునకు మేం వస్తాం !



కామెంట్‌లు
Popular posts