ఈ పవిత్ర భారతదేశం నా దేశం
నే పుట్టి పెరిగిన నా జన్మ ప్రదేశం
అందిస్తుంది ఇది ఓ శుభ సందేశం
బంధిస్తుంది మనలను ఆ ఆదేశం!
స్పందిద్దాం భారతీయులకు అందిద్దాం
విందిద్దాం మన ఐక్యతను చిందిద్దాం
మన దేశ భద్రత మనందరకు ముఖ్యం
అప్పుడే మనందరకు కలుగు సౌఖ్యం !
కలసికట్టుగా మనమంతా ఇక ఉందాం
అలసినట్టున్న బలం పుంజుకుందాం
దేశ భద్రతకు మనం కట్టుబడి ఉందాం
దేశ ఐక్యతయే ఘనం పెట్టుబడి అందాం !
పరాయి ముష్కరుల పెంచి పోషిస్తున్న
తురాయి ఎగిరేసి మనల ద్వేషిస్తున్న
చైనా పాకిస్తానులకు చెప్పాలిక బుద్ధి
అంతర్జాతీయ వేదికపై మనం బల్ల గుద్ది !
మన దేశ భద్రత మనందరి బాధ్యత
ఘన సైనికులకే ఉంది ఆ యోగ్యత
అయినా మనందరం పాలు పంచుకుందాం
స్వయానా సరిహద్దు వివాదం తెంచుకుందాం !
ప్రజలందరకు కంటి నిండా నిద్రించే భరోసానిద్దాం
సైనిక రక్షణ వ్యవస్థను చక్కదిద్దు ధిలాసా చిందిద్దాం
భరతజాతి సమైక్యతను పటిష్టం చేసేద్దాం
భరతఖండం భద్రతను పరిపుష్టం గావిద్దాం !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి