మహనీయుడు మన గాంధీజీ: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ.
గాంధీజీ అంటే నీతి నిజాయితీ
నిష్ఠలతో ప్రభావితం చేసే ఓ శక్తి
బాపూజీ అంటే జాలి దయ ఓర్పు
శాంతి సహనం కరుణ మూర్తిభవించిన 
మన భారతీయుల ముక్తి ప్రదాత మనందరి 
నొసటి వ్రాస్తాను సరిదిద్దున మన భాగ్య విధాత !

ఆ మహనీయుడు పుట్టింది
పోరు బొందరు అనుగ్రామంలో
పోరు సల్పుతూ  కాలు పెట్టింది 
స్వాతంత్ర సమర సం గ్రామంలో !

మన యోగక్షేమాలను ఆశించి
దేశం విడిచి పోవాలని శాసించి
ఆంగ్లేయులను తరిమి కొట్టిండు
స్వాతంత్రం సాధించి పెట్టిండు !

స్వతంత్రించి యుద్ధభేరిని మ్రోగించారు
స్వాతంత్ర సమరాన్ని తను సాధించారు
ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ఎదిరించారు
వారి గుండెల్లో సింహ స్వప్నమై నిదురించారు !

అహింస ఏ ఆ మహనీయుని ఆయుధం
ఆంగ్లేయుల పీచమనిచిన వజ్రాయుధం
ఏ పోరాటమందు నీ వెరగవు అపజయం
పోరు సల్పి మాకు అందించావు విజయం !

తత్ ఫలితంగా సిద్ధించెనుగా స్వాతంత్ర్యం
ఫలించనిగా నీ యూహ్య పంచతంత్రం
పలు సత్యాగ్రహాలు నడిపిన మహనీయుడవు
నిత్య గ్రహ బాధల తొలగించిన మా మహానుభావుడవు !


కామెంట్‌లు