కథలు చెప్పువాడు కార్యశూరులుగారు
కర్మచేసిచూపుకార్యశీలి
కథలవల్లబతుకుకళచెడిపోవును
కర్మయోగి తనమె కర్తగుణము
రంతిదేవుడంటిరాజులులేరులే
డబ్బుకమ్మునీరుడబ్బుమనిషి
మానవత్వమంతమనుషుల్లోమృగ్యము
వినుము సోదరుండ వీరభద్ర
వర్తకమ్మునడుపవారునుచేయుచు
మందుగుండు నమ్మి మనిషి చంపు
విలువలన్నినేడువిత్తమ్ముపాలాయె
వినుము సోదరుండ వీరభద్ర
కల్తిపాలునేడుకాలకూటవిషము
నాటుబర్రెపాలునయమునయము
పశువులేడలేవుపాలెలాసాధ్యమో!
వినుము సోదరుండ వీరభద్ర
రాజకీయ మంత రంకాయెబొంకాయె
మనిషితనమెచచ్చిమదముహెచ్చె
దయనువీడినోడెదాయాదియేలిక
వినుము సోదరుండ వీరభద్ర

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి