అమ్మానాన్నలు:- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ-9640748497
అమ్మ ఒడే అన్నింటా 
గొప్పదన్నోడు
అమ్మ చనుగుడిచి పాలుద్రాగి
ఆడిపాడినోడు
చందమామ రావే జాబిల్లి రావే అంటూ 
అమ్మచేతి గోరుముద్దలు తిని ఎదిగినోడు 
తల్లిదండ్రుల సొమ్ముతో
పెరిగి పెద్దవాడైనోడు
నేడు స్వార్థపు పొరలు కనులకుకమ్మి
తల్లిదండ్రులనే విచక్షణ మరచి
కండకావరంతో నానాదుర్భాషలాడుతున్నాడు

అమ్మా నాన్న అని పిలవడమే
అవమానకరంగా భావించే
కుసంస్కారులు 
ఎక్కొచ్చిన మెట్లు మరచిన
(దొంగ) నా కొడుకులు
కనికరమే లేనట్టి కాలయములు 

కన్నకొడుకు ఉన్నా నిరాదరణతో
అనాథలై ఆసరాలేకా
దిక్కుతోచని స్థితిలో 
వృద్ధాశ్రమంలో తలదాచుకుంటున్నారెందరో...

రేపు కొడుకు దిగే మెట్లు లెక్కబెట్టుకోకతప్పదుకదా!

కాలం ఎంత పౌరుషమున్నవాన్నైనా
లొంగదీసుకుంటుంది
చూస్తూ ఉండూ
ఒక్కకలకనగానే
జీవితం ముగిసినట్టుకాదుగదా!?
ముసలి తల్లిదండ్రులను గోస 
బెట్టిన కొడుకులు మట్టి కొట్టుకుపోతారు

==========================

కామెంట్‌లు