ఒక అయ్యదిగి
మరో అయ్య సీటెక్కే
ఉచిత హామిలిచ్చి
వస్తుధరలు బెంచి
ఉపాసముండబడితిమి
ఊపిరాగబట్టే!
ఈ యుద్ధం పాడుగాను
కట్టెల పొయ్యి మీద వంట
కమురువాసనరాబట్టే
కండ్లన్నీ పొగసూరబట్టే
గ్యాసేమో నిండుకునే
యుద్ధం ఆగుడెన్నడో?
ఈ కట్టం దీరుదెన్నడో?
నాకు తెల్వకడుగుతా
తెలంగాణ బస్ భవన్
వెనుకాల గ్యాస్ బావి ఏమన్న ఉన్నదా!?
మహిళలకు ఉచిత బస్సు
ప్రయాణంబెట్టి మొగోళ్ళకు
చార్జీలు పెంచుడేందో!?
లోగుట్టు ఎవనికైనా ఎరికే
నేతల ఓటుబ్యాంకు
కొరకే!?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు ఋణ విముక్తి కల్గిస్తరంటే
ఆసాంతం అప్పులపాల్జేస్తాండ్రు
ఇదిఏ ప్రగతిశీల సూత్రమో!
పాలకులు తేటతెల్లంచేయాలి
నారు పోసినోడు నీరుపోయడా!?
కళ్యాణలక్ష్మీ పథకమెందుకు!?
ఖజానాకు బొంక బెట్టుడెందుకు?!
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించక
ఈ రైతు భరోసా ఎందుకు?!
విత్తనాలు ఎరువులు పురుగుమందుల ధరలు పెంచుడెందుకు?!
రైతు నడ్డివిరచడమెందుకు?!
ఇదంతా రేపటి ఓటుబ్యాంకు
రాజకీయమే కదా!?
లక్షల్లో నిరుద్యోగులుంటే
వేలల్లో ఉద్యోగాలు
కోచింగ్ సెంటర్లకు దోచిపెడుతున్న
ప్రభుత్వాలు
స్వయం ఉపాధి కల్పన చేపట్టలేరా!?
ఎస్సీ, ఎస్టీ ,బీసీ సంక్షేమసంస్థల ద్వారా ఋణాలు
ఇప్పించలేరా!?
వారిని సొంతకాళ్లపై నిలబడేలా చేయలేరా!?
ఇదీ ఓటు బ్యాంకు పథకంలో ఒక భాగమే కదా!?
ఇప్పుడు రాజకీయ నాయకుడు
ఒక పొలిటికల్ యానిమల్
ఎంతసేపు ప్రజలను పావులుగా వాడుకొని
ఎదుగుతున్న పచ్చి స్వార్థపరుడు
ఉచితాలు వద్ధు
ఉద్యోగ ఉపాధులు ముద్దు
విద్య ,వైద్యం ,కార్పోరేట్ల గుప్పెట్లోకి పోవొద్ధు
బడుగు బలహీన వర్గాలకు
అన్యాయం తలపెట్టొద్ధు
ఓట్లు పేదలవి సీట్లు పెద్దలవా!?
రాజ్యాధికారం దిశగా
ఈ బడుగుల అడుగులు వేయాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి