మన ఆవేదనను పట్టించుకునే దెవరు?!
ఓటును నోటుకమ్ముకున్నాక లోకువైతిమి!
సీటెక్కిన నేత మందిమార్భలంతో యమఫోజు కొడుతున్నాడు
ఇప్పుడు ప్రజాదేవుళ్లేడున్నారు
అంతా ప్రజాకంటకులే
మనం మన హక్కులను విస్మరిస్తిమి
మన ఓటును
నాటుకు బిర్యానీ ప్యాకెట్ కు
విక్రయిస్తిమి
మనం ప్రశ్నించడాన్నే కోల్పోతిమి
ఈ నోటు పాడుగాను
నాఓటునోటాకేసిన
బాగుండేది
గెలిచినోడు అంతాదోచుకోవడానికే
ఆ గద్ధెనెక్కిండు
వాగులోని ఇసుకనంతా బుక్కిండు
గుట్టకున్న చెట్లన్నీ తెగనరుక్కుండు
ఎర్రమట్టి దిబ్బలను టిప్పర్ లారీలకెత్తి ఊరుదాటించిండు
ఇదేంది సార్ అంటే
పోలీసోల్లతోని కుల్లబొడిపిచ్చిండు
నాదీ రాజ్యం నేను ఆడింది ఆట పాడింది పాట అని
మీసం మెలేస్తున్నాడు
ఈ మాబాధ ధనికస్వాములకు పట్టదు
వారు సమృద్ధిగా ఉన్నోళ్లు
బడుగు బలహీనులకు నిరుపేదలకు చిన్న చిన్న కమతాలున్న బక్కరైతులు
వ్యవసాయ కూలీలు, దినసరి కూలీలు పని పాటలు లేక పస్తులుంటుండ్రు
అత్యవసమై వారు పని కల్పించిన వారికి
తోచినంత కూలీ చెల్లిస్తరు
ఇదేందయ్యా అంటే తనపైన హత్యాయత్నం చేయచూసారని ..
ఉల్టా జూటా మాటంటడు
కాదు కూడదు అని మీరు గోల చేసారో
ఉన్నపళంగా చేతికి సంకెళ్లు వేయించి ఏదో ఒక నేరం మోపి జైలుకు పంపిస్తానని బెదిరిస్తడు
ఇప్పుడున్న ఏలికలంతా ప్రజా దేవుళ్ళు కాదు
అంతా ప్రజాకంటకులే
ఒకటీ అరా ఉత్తమ ఏలికలున్నా చేతుల్లేనివాడికీ
అవినీతిని అంటగడతారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి