అతడు
భూతలమంతా
చీపురునాడిస్తూ
సకల మానవాళికి
ఆరోగ్యభాగ్యాన్ని
అందించు సపాయి కార్మికుడు
కంపు ఆవాసలనైనా
అద్ధమోలే పరిశుభ్రపరచి
మానవ జీవన ప్రతిబింబానావిష్కరిస్తున్న
అసామాన్య కార్మికుడు
ఒంట్లో జొచ్చిన రోగంతో
నిత్యసహవాసం చేస్తూ
చావుకే ఎదురీదుతున్న
మృత్యుంజయుడు
ఈల ఊది పలకరిస్తూ ఇంటింటి మైలనంత...
అసహ్యమైనా.. సహనంతో
తన బండికెత్తుకొనితీసుకెళ్లే
మన ఆత్మబంధువు
చాలీచాలని జీతంతో
తాను బ్రతుకుడే దుర్భరమైనా
కరోనా కల్లోల్లాన్ని
చీపురు తిరగేసి ఒంటిచేత్తో ఊడ్చేసిన
స్వచ్ఛ కార్మికుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి