ఆటవెలది పద్యసుమాలు : - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-\\9640748497
ఉచిత బస్సుబెట్టయుచితమాయేలికా?!
డిజిలు బావి గలదె డిపొల వెనుక
పనులు చూప లేని పాలకు లేలనో?!
వినుము సోదరుండ వీరభద్ర

తీర్థయాత్ర తిరుగ తీరొక్కజాగకూ
ఉచిత బస్సు తోడ యురికెజనులు
దేశదిమ్మరైరిదేశాలుతిరుగుతూ!
పనులు చూపనోడుపాలకుండె!?

బడికిబోవుబాలబడులనువదిలేసి
బస్సునెక్కితానుభద్రగిరికి
రాత్రి పదియు దాట రాదాయెయింటికి
కన్నవాళ్ళగోసకాంచరేమి

వృద్ధులెంచియిస్తెవృద్ధియౌనుచితము
బస్సునెక్కగలరుభక్తజనులు
కూలికుచితమియ్యకూటికాపయనము
ఉద్యోగస్తుకియ్యయుత్తదౌను

బతుకు భారమెచ్చభారమౌపయనమూ!?
ఉచిత మిచ్చి రేపు యూడ్చువోట్లు
ఏలువాడియెత్తుయెంతిచ్చెలాభము!?
ఏలికేరనేడుయేకుతార


కామెంట్‌లు