యుద్ధం ఎవడి ప్రయోజనాల కోసమో ఏమో
వంటగ్యాస్ నిండుకొని
టిఫీన్స్ ఇంట్లో బందు అని
హోమ్ మినిస్టర్ ఆర్డర్ పాస్
చేసింది
రోజుకు రెండు సార్లు టీలు
ఉండవు
ప్రొద్దుటిపూటే
నాకు అర్ధం కాక అడుగుతా
ఈ ఎండాకాలం పూట ప్రొద్దున
టీ త్రాగవలసిన
అవసరం లేదనీ మరో ఉత్తర్వు
కాదు కూడదు అంటే
గొడ్డలి అందుకొని గుట్టకు పోయి
ఎండిపోయిన చెట్లు కొట్టుకొని
కట్టెల మోపెత్తుకొని రమ్మని
మరో మధ్యంతర ఉత్తర్వు
దీంట్లో చిన్న సవరణ
కట్టెల పొయ్యి ఎలా అంటించాలోకూడా
నాకు తెలియదని ఉఫూ ,ఉఫూ అంటూ
ఇంటి యజమానిగారే ఊదుకోవాలని
కఠినమైన నిబంధన
గ్యాస్ బ్లాకులో కొనలేము
గుట్టలే కనుమరుగాయే
కట్టెలేడతెద్ధు
నాదో చిన్న సలహా శ్రీమతిగారు
ఈ రోజు నుండి అమృతాహారం
అదే మొలకలు ,డ్రైఫ్రూట్స్
కీరదోసకాయలు
బెండకాయలు
క్యారెట్
స్వీట్ పొటాటో
ఇలా రోజుకొక వెరైటీ చొప్పున
ఆరగిద్ధాము
ఆరోగ్యానికి ఆరోగ్యం
డబ్బులకు డబ్బులు
ఆదా అవుతాయి
ఏమంటారు
అపర కాళికలా ముఖంలో హావభావాలు
సరే ...
గ్యాస్ డిపోకు ఫోన్ చేస్తా
ఏ తిప్పలైనపడి గ్యాస్ బండ తెస్తా
గ్యాస్ దేశ ప్రజల మెడమీద గుదిబండ
సంప్రదాయ వనరుల అభివృద్ధి చేసుకోవడం
విండ్, పవన ,సౌర విద్యుత్ వినియోగం పెంచాలి
దేశాల మధ్య వచ్చిన
ఆధిపత్య అంతర్యుద్ధం సంప్రదింపులతో
పరిష్కరించుకోవాలి
అంతేకాని యుద్ధం అంటే ఏంటో తెలియని పసిపిల్లలను
నడవలేని వికలాంగులను వయోవృద్ధులను
రోగగ్రస్థులను బలిగొనకూడదుకదా
వంటబండ ఇంట్లో గత్తరలేపోద్ధుకదా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి