ఊరు చెంజర్ల
బడుగు సైరికుని ఇంట మెరిసిన
శబ్దార్థ చంద్రిక
పుట్టిన వరి మళ్ళ దున్నిన నాగలి
విద్యా విన్యాస బౌద్ధిక వాది
పురాణేతిహాసాల ఆధునిక కవిత్వ ద్వారాల నడిచి నేర్చి
పాఠాలు నేర్పిన అక్షర గురువు
కరీంనగర్ కావ్య శోభల నడిచె కవిత్వజీవి
నలుభయేండ్లు ఉద్యోగ చెలిమి చేయిపట్టి నడిచిన స్నేహ జీవి
వాదాలు ఏవయిన ఎన్నియున్నా
మానవత్వవాదమే జీవమనె బుద్దిజీవి
శిష్యలు మిత్రులే ఆస్తిపాస్తి గురువుకు
పీల్చిన గాలిలో కలిసి తేలిపోయె
వాదాలు వేదనలు వీడి నాస్తిక జీవి
వాస్తవికతయే ప్రామాణికమైన విజ్ఞాన జీవి
గలగల మానేరు కవి గోష్టి నిరంతర ప్రవాహమే
స్వేచ్ఛగా అలలతీరాన
తేలియాడు మలయశ్రీ ఓ హేతువాది
**&&&&&*&&&&*

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి