అమ్మమ్మ సూక్తులు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
దేవుని కటాక్షము 
ఉన్నవాడు ధన్యుడు 
అట్టి వారి జీవితము 
అందరికాదర్శము 

వినయమే కిరీటము 
బ్రతుకులో ఉన్నతము 
కల్గియుంటే గనుక 
వారికదే కానుక 

పసి పిల్లల తలపులు 
మేలి పసిడి కాంతులు 
వారి నోటి పలుకులు 
జాలువారు తేనెలు 

నిజమాడే పెదవులు 
ప్రేమలొలుకు మనసులు 
భగవంతునికిష్టము 
మేలు చేయు మనుషులు 


కామెంట్‌లు