బడి గంట మా నేస్తం! :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
అందమైన మా బడికి 
అక్షరాల అమ్మ ఒడికి 
పలుకుతుంది ఆహ్వానము 
బడి గంట మధుర స్వరము 

మాకెంతో ప్రియము ప్రియము 
వీనులకు పర్వదినము 
బడి గంట తీయని పిలువు 
బ్రతుకుల్లో మేలుకొలుపు 

బడి గంట మా నేస్తము 
త్యాగానికి అది చిహ్నము 
గంట గంటకు మ్రోగుతూ 
ప్రేమగా పలుకుతుంది

కాలం విలువ తెలుపును
క్రమశిక్షణ ఇల నేర్పును 
విద్యార్థులకు ఉపకారము 
అందించును సహకారము


కామెంట్‌లు