అక్షరాల ఆకాంక్ష : --గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
జీవితాన ధైర్యము 
శిఖరమంత సహనము 
కల్గియుంటే గనుక 
దాసోహం విజయము 

రానప్పుడు సమయము 
మంచిదేగా మౌనము 
ఎదుగుటకు బ్రతుకులో 
వెలుగుటకు జగతిలో 

సృష్టిలోన దైవము 
వెలుగుతున్న దీపము 
బలిష్టమైన దుర్గము 
మోక్షానికి మార్గము 

నవ్వులొలుకు  వదనము 
చూడ చంద్రబింబము 
వెదజల్లును అందము 
పంచిపెట్టు మోదము 


కామెంట్‌లు