పరిగణలోకి తీసుకోవాలి! : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
జీవితాన సమస్యలకు 
ఉంటుంది పరిష్కారము 
మితిమీరిన కలతలకు 
మనశ్శాంతి బహు దూరము 

పనికిమాలిన పనులకు 
తిలోదకాలివ్వాలి 
మంచి మంచి తలపులకు 
స్వాగతమే పలకాలి 

వయసులోన పెద్దలకు 
గౌరవమే ఇవ్వాలి 
ఇలలో తల్లిదండ్రులకు 
తొలి స్థానమే ఉండాలి 

మహనీయుల మాటలను 
గురుదేవుల బోధలను 
శ్రద్ధగా ఆలకించాలి 
ఆచరణలో పెట్టాలి 


కామెంట్‌లు