అక్షరాల సందేశం : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
క్షమాగుణంతో వైరము 
ఘన శాంతంతో కోపము 
చిత్తు చిత్తు చేయొచ్చు 
పొందవచ్చును విజయము 

నవనీతమే హృదయము 
చేయకూడదు గాయము 
విలువైనదే కాలము 
వాడకపోతే నష్టము 

అమూల్యమైనది స్నేహము 
ఎప్పుడు చేయకు ద్రోహము 
మన వారైనా న్యాయము 
తప్పకూడదు నేస్తము 

తల్లిదండ్రుల ఋణమును 
తీర్చుకోవాలి తప్పక 
గురుదేవులను ఆజ్ఞను 
పాటించాలి మానక 


కామెంట్‌లు