చిన్నారులు చిరుదివ్వెలు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
మధురమైన  గీతాలు 
అందమైన కుసుమాలు 
కదిలించును హృదయాలు 
గంభీరమైన భావాలు 

చిన్నారుల నయనాలు 
సున్నితమైన పాదాలు 
ముగ్ధమనోహరం కదా 
ఇది గమనార్హం సదా 

పసి పిల్లలు ముత్యాలు 
వారి నోట సత్యాలు 
కనువిందు చేయునోయి!
ముద్దులొలుకు వదనాలు 

చిన్నారుల యోచనలు 
సిరిమల్లెల సువాసనలు 
అతి పవిత్రం మనసులు 
తేనెలాంటివి పలుకులు 

చిన్నారులు చిరుదివ్వెలు
మ్రోగేటి సిరిమువ్వలు 
విహరించే విహంగాలు 
ప్రగతికి పట్టుకొమ్మలు


కామెంట్‌లు