చదువుకున్న బాలిక : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
అందమైన మాలిక 
అవనిలోన బాలిక 
ఇంటిలోన దీపిక 
మింటిలోన తారక 

ఆడపిల్ల భాగ్యము 
సదనంలో క్షేమము 
ఆమె ఉన్న గృహమున 
చిందును అనురాగము 

చదువుకున్న బాలిక 
అవుతుందోయ్! ఏలిక 
సాధించును విజయము 
బాగుపడును కుటుంబము 

వివక్షత మానాలి 
సమన్యాయం చేయాలి 
ఆడపిల్ల ఉన్నతికి 
ముందడుగు వేయాలి 


కామెంట్‌లు