అక్షరాల సత్యం : - -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
ధర్మమే అడుగులకు 
వెలుగులు పంచుతుంది 
నీతి, నిజాయితీలే 
బలంగా నిలుస్తుంది 

నిరంతర పరిశ్రమ 
లక్ష్యాన్ని చేర్చుతుంది 
జీవితంలో భ్రమ 
వాస్తవాన్ని తరుముతుంది 

నిశ్చలమైన భక్తి 
మోక్షాన్ని ఇస్తుంది 
అంతరంరాన శక్తి 
అన్నీ సాధిస్తుంది 

నీలోని మంచితనము 
ఘనమైన దైవగుణము 
సదా కాపాడుతుంది 
అక్షరాల సత్యమిది 


కామెంట్‌లు