కాసింత జాగ్రత్త పడాలి :- -గద్వాల సోమన్న, గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
ఆశయం ఉన్నప్పుడు 
మేను సహకరిస్తుంది 
పదును పెడుతున్నప్పుడు 
మెదడు వికసిస్తుంది 

సోమరిగా ఉన్నప్పుడు 
బుద్ధి మందగిస్తుంది 
పిరికితనం తోడైతే 
భయం ఆవరిస్తుంది 

అతిచనువు ఎక్కువైతే 
చెరుపుకు దారితీస్తుంది 
వ్యసనాలకు లొంగితే 
బ్రతుకు ముక్కలవుతుంది 

గర్వాగ్ని జ్వాలల్లో 
కోపమనే కోరల్లో 
చిక్కి నష్టపోకూడదు 
శల్యమై పోకూడదు 


కామెంట్‌లు