నక్క తిక్క! అచ్యుతునిరాజ్యశ్రీ

 అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉండేవి కానీ ఒక గుంట నక్క నిశ్శబ్దంగా ఉండి తిక్క పనులు చేస్తూ మిగతా వాటిని ఏడిపిస్తూ అవి లబోదిబో అంటుంటే చాటుగా వెళ్లి నవ్వుకుని తెగ మురిసిపోయేది. దాని పిల్లలు కూడా అలాగే టక్కుటమారంగా తయారయ్యారు మరి అమ్మానాన్న సరిగ్గా ఉండకపోతే పిల్లలు కూడా ఇలాగే చెత్త పనులు చేస్తారు కదా నక్క మిగతా పొలాల్లోకి వెళ్లి కావాల్సిన దుంపలు గట్రా దొంగిలిచ్చేది దాని పెద్ద కూతురు ఒక రైతు దగ్గర టమాటాలు కోసి తెచ్చింది అబ్బా భలే పని చేసావే అని సంతోషించింది నక్క కానీ రైతు మాత్రం లబోదిబో అన్నాడు అసలే యుద్ధ వాతావరణం పరిస్థితులు బాగా లేవు అకాల వర్షాలతోటి పంట కూడా నాశనమైతుంటే టమాటాలు కూడా మాయమవుటంతో బాధపడ్డాడు వెళ్లి ఊరి పెద్ద కు చెప్పాడు ఇంతలో నక్క అక్కడికి వచ్చి అయ్యా రైతు నే టమాటాలన్నీ ఆ కుందేలు తీసుకుపోతుంటే నేను చూశాను దాన్ని పట్టుకుని బాధ కొట్టదామనుకున్నాను కానీ అది చిక్కకుండా తుర్రుమంది అనేటప్పటికీ అంతా దాని మాటలు నమ్మారు ఇంకో రోజు దాని రెండవ కూతురు ఉడత ఎలుక దాచుకున్న రకరకాల గింజల్ని ఏరుకుని తీసుకు వచ్చింది పైగా అక్కడే ఉన్న ఎలుక పిల్లల్ని గుటకాయ స్వాహా చేసింది ఏం చేసేది లేక ఉడతా ఎలుక బోర్ బోర్ మని ఏడవసాగాయి కానీ పైనుంచి చూస్తున్న ఓ చిలక ఇలా చెప్పింది ఏడవకండి ఈ దొంగ పనులన్నీ చేసేది ఆ గుంట నక్క దాని పెద్ద కూతురు వాటిని పట్టుకుని చితక్క కొట్టేలా ఉపాయం ఆలోచించండి అప్పుడు అన్ని కలిసి తేనెటీగల దగ్గరికి  వెళ్ళాయితేనెటీగల ఉన్నాయి కదా ఆ నక్కకి దాని కూతురికి మనం బుద్ధి చెప్పాలి మేము వెళ్లి ఆ రెంటిని చుట్టుముట్టి బాగా రక్తం వచ్చేలా కుట్టి బుద్ధి వైఫ్ ఎలా చేస్తాం అని అవి నక్క దాని కూతుర్ని ఒళ్లంతా కుట్టి కుట్టి దినావస్థలోకి తెచ్చి కుయోమరో అనిపించాయి ఆ దెబ్బతో వాటికి బుద్ధి వచ్చింది వెంటనే గ్రామ పెద్ద నక్కని పిలిచి నువ్వు నీ కూతురు పొలాలలో పని చేస్తూ కొత్త మొలకలు పైర్లు పంటలు పండిస్తూ అందరికీ సేవ చేయాలి భూమి సారవంతం అయ్యేలా చెత్తనంతా పోగేసి కంపోస్టు ఎరువు తయారు చేయాలి అబద్ధాలు చెప్పితే వారిని దండిస్తాము ఈ తేనెటీగల ద్వారా అనేటప్పటికీ నక్క దాని కూతురు అలాగే బాబు ఇవాల్టి నుంచి మేము ఏ ప్రాణి తోలు కి వెళ్ళాము దొంగతనం చేయము మాకు తోచిన విధంగా ప్రతి ప్రాంతాన్ని శుభ్రం చేస్తాము కంపోస్ట్ ఏరు తయారు చేస్తాము పక్షి గూళ్లను కాపాడుతాం అని ఆ రోజు నుంచి తమ బుద్ధిని మార్చుకొని మంచిగా జీవితాన్ని ప్రారంభించాయి🌹
కామెంట్‌లు