ఆశా భోస్లే కు అక్షరనివాళి: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం


 భారత సాంప్రదాయ సంగీతమైన
చలన చిత్ర గీతాలయిన
జానపద, ఖవ్వాలి పాటలైన
గజల్స్, భక్తి పాటలైన
అలవోకగా పాడి
అన్ని వయస్సుల వారి
హృదయాలను
తన సుస్వర గానంతో 
అలరింప చేసిన గాన కోకిల ఆశా భోస్లే
ఎనిమిది దశాబ్దాలుగా వేలాది హిందీ, తెలుగు ,
 బహు భాషాచిత్రాలలో పాడిన ఏకైక గాయని.
యాదోన్ కి భారత్ లో చురా లియా హై తుమ్నె
హారేరామ హరేకృష్ణ లో
దమ్  మారో దమ్  
కారవాన్ లో పియా తూ అబ్ తో ఆజా వంటి
అనేక హిందీ
తెలుగు లో చందమామ లోని
నాలో ఊహాలకు
ఇద్దరులోని వెన్నెల వెన్నెల వంటిపాటలు
ఆర్.డి బర్మన్, గుల్జార్ తో కలసి 'దిల్ పడోసి హై' 
అనే డబుల్ ఆల్బమ్ ను రూపొందించిన గాయని
దుబాయ్ లో తొంబది పుట్టిన రోజు కొక కోలా 
ఏరీనాలో న భూతో న భవిష్యతి గా జరగడం 
ఆమె ఫిల్మ్ ఫేర్ ,జాతీయ ఉత్తమ నేపధ్య గాయని
బెస్ట్ ఫిమేల్ సింగర్
నైటింగేల్ ఆఫ్ ఆసియా అవార్డు
లతామంగేష్కర్ అవార్డు
అత్యుత్తమ దాదాసాహెబ్ పాల్కే పురస్కారం
ప్రభుత్వ అత్యున్నత పద్మవిభూషణ్  ఎన్నో ఎన్నెన్నో 
పురస్కారాకే వన్నె తెచ్చిన గాన కోకిల
తొంబది సంవత్సరాలు దాటిన వయస్సులో
శ్రీరామచంద్రుని దరి చేరినా
పాట ఉన్నంత వరకు మీరు చిరస్మరణీయులే
అందుకోండి మీకివే నేనందిస్తున్న అక్షరనివాళి...!!
..........................

కామెంట్‌లు