అందరికీ జ్ఞానాన్ని అందించేది పుస్తకం.
తరగనది,
తరగతి గదిలో ముఖ్యమైనది పుస్తకం.
జ్ఞానాన్ని పంచే అక్షయ పాత్రలు పుస్తకాలు..
తరాల వారధి పుస్తకాలు..
క్షరం కానిది అక్షరం.
ధనం కొందరి సొత్తు..
అక్షరం జనులందరి సొత్తు..
అక్షరాలతో పదాలు, పదాలు వాక్యాలు, పాఠాలుగా ఏర్పడి
పుస్తకాలుగా ముద్రితమైనే వీటిని గురువులు చదువు చెప్పేందుకు, విద్యార్థులు చదువు నేర్చేందుకు, అందరూ చదివేందుకు ఉపయోగపడతాయి. విద్య ఏదైనా విద్యార్థులకు అందివ్వాలంటే భాషావేత్తలు, రచయితలు, కవులు జ్ఞాన విషయాలను రచించి పుస్తక రూపంలో ముద్రణ గావించాలి.. మనలోని ఆలోచనలు విషయాలను కాగితంపై వ్రాసి పుస్తక రూపం దాల్చితే అది శాశ్వతంగా ఉంటుంది. భావి తరాలకు చేరుతుంది. పూర్వం ఋషులు, మునులు, యోగులు తామ్రపత్రాలపై గంటాలతో లిఖించేవారు. అవి చెరిగిపోయి, విరిగిపోయి, పుచ్చిపోయి అపారమైన అద్భుత జ్ఞాన సంపదను కోల్పోయాం.
కాలక్రమేణా కాగితం రావడంతో వాటిపై, సిరాతో వ్రాయడం వాటిని ఒక కట్టగా దాచడం, తిరిగి పుస్తకంగా మలచి ప్రచురించారు. నేడు చెరగని సిరాలు కూడా లభ్యమవుతున్నాయి, వ్రాతలు చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. భద్రపరచి భావితరాలకు అందివ్వాల్సిన భాగ్యసంపద పుస్తకాలు.
కరిగిపోయే ఆస్తి కన్నా
కలకాలం నిలిచిపొయే, తరతరాలకు జ్ఞానాస్తిని అందించే పుస్తకాలు మేలు..
అక్షరాలతో నిండుగా పుస్తకం.
నేర్చిన వాటితో నిండుగా మస్తకం.
జ్ఞాపకం ఉన్న విషయాలే మాత్రమే ఎవరైనా చెప్పగలరు.
విద్యార్థులు, పెద్దలు ఎవరైనా చదివినదేదైనా అన్ని విషయాలు ఎక్కువ కాలం గుర్తుండవు. కొంతకాలం తర్వాత చెప్పలేరు. అవి కావాలంటే అవసర విషయం గల పుస్తకాన్ని తప్పక తెరవాలి, చదవాలి..
చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో.. అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు.
పుస్తకం నోరు తెరవని ఉపన్యాసకుడు.
మౌనం వహించిన మహాకవి.
ఒంటరితనాన్ని పోగొట్టే మిత్రుడు.
పుస్తకాలు జ్ఞాన నిధి: - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు(ఋష్యశ్రీ)- సారవకోట
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి