రామలక్ష్మణులు స్వచ్ఛమైన సూర్యకాంతులతో
నిర్మలముగానున్న ప్రాతః కాలమునందు
సంధ్యోపనది కార్యక్రమములను ముగించుకుని
విశ్వామిత్రుని వెంట గంగానది తీరమునకు చేరినారు
ప్రతినిష్టాపరులు మహాత్ములు అయిన మునులు అందరూ
ఒక చక్కని నావను తెచ్చి విశ్వామిత్రునికి ఇచ్చి
రామలక్ష్మణులతో మీరు నావను అధిరోహించు స్వామి
విశ్వామిత్రుడు మునులకు వీడ్కోలు పలికి
రామలక్ష్మణులతో ఆ నావలో ప్రయాణించుతుండగా
మధ్య భాగంలో అలల మహా ధ్వని విని రాముడు
ఈ నది మధ్యనశబ్దమేమిటి స్వామి అని అడిగెనట
కైలాస పర్వతము నందు బ్రహ్మదేవుడు
తన మనసులో ఉన్న సంకల్పముతో
ఒక సరస్సును అచట సృష్టించినాడు
దాని పేరు బ్రహ్మ సరస్సు అంటారు
బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించినందున
ఈ జలమంతయు పవిత్రమైనదిరామా
సరయూనది గంగానదిలో సంభవించినప్పుడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి