ఉద్యోగ పర్వము ద్వితీయాశ్వాసము- 217 వ రోజు
స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు. తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువయినా కోరిన సహాయం చేయాలి. ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి. మంచి వారు పొగడ్తలకు పొంగిపోడు. మరింత మేలు చేస్తాడు కాని కీడు చేయడు.
నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని పెంచి పెద్దచేసి, రక్షించి ఆదరించి ఇప్పుడు వారు వేరుగా ఉంటే ఊరుకోవచ్చునా. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని రప్పించి, నీ కొడుకులతో సమానంగా ఆదరించడం నీ ధర్మం. మీరు వాళ్ళూ కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు " అన్నాడు.
ధ్రుతరాష్ట్రునికి విదురుడు బుద్ధిమతి చెప్పుట
విదురుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు " విదురా? నాకు మేలు చేకూర్చేది, కర్తవ్యమయినదీ నీవే ఎఱుగుదువు. ధర్మరాజు పద్ధతి కూడా నీకు తెలుసు. నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు " అని అడిగాడు. విదురుడు " నన్ను ఈవిధంగా నొక్కి అడిగితే ఉన్న సంగతి చెప్పాలి కదా.సావధానంగా విను " అన్నాడు.
"రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యభాగాన్ని కూడా మింగుదామని చూస్తున్నావు. అది ఎలా
జఱుగుతుంది. చేప అత్యాశతో మాంసంతో పాటుగా గాలాన్ని కూడా మింగిన విధంగా ఉంది నువ్వు చేస్తున్న పని. వంచకుడైన నీ కొడుకు మనసులో అనుకున్నదంతా మాట్లాడితే అది నెరవేరుతుందా. విదురుడు ఈ విధంగా అనడం విని ధృతరాష్ట్రుడు నోటమాటలేనివాడై, నిశ్చేష్టుడైపోయాడు. నిద్రలేకపోవడంవల్ల అలసటతో , ఆలోచనలతో సతమతమవుతూ " విదురా ! ఇప్పటివరకు నీ మాటలతో నా మనస్తాపం కొంత తగ్గింది. నాకు కార్యం సాధించే నీతిని, సాధించలేని అవినీతిని చెప్పు" అన్నాడు. అప్పుడు విదురుడు అతనితో ఇలా అన్నాడు.
"పక్వానికి రాక మునుపే పండును కోస్తే తినడానికి రుచిగా ఉండక పోవడమే కాక, దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది. దండలు కట్టేవాడు చెట్టునుంచి పువ్వులు కోసే విధంగా, తేనెటీగలు పూవు నుంచి తేనెను గ్రహించే విధంగా ఎదుటివాడు బాధ పడకుండా పనిచేసి ఫలితాన్ని పొందాలి. అంతేకాని బొగ్గుల కోసం చెట్టు మొదలంటా నరకకూడదు.
పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి, తేజస్సుకు, ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేకుండానే బాధ పడతాడు. ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోతే మాట్లాడకుండా ఊరకే ఉండటం మంచిది. మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీర్తి, అపకీర్తి కలుగుతాయి.
గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది. కాని మాటలతో చెడిన కార్యం, సిద్ధించదు. శరీరంలో విరిగిన బాణాలను ఉపాయంతో తొలగించవచ్చు కానీ మనసులో నాటుకున్న మాటలనే గాయాలను ఎన్ని ఉపాయాలతో నైనా మాన్పలేము.
ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కొడుకులు ఒకరిని మించి ఒకరు నీచవాక్యాలు అనేకం పేలుతూ ఉంటే నీవు దానిని జంకూగొంకూ లేకుండా వింటూ ఊరుకుంటున్నావు. నీకు ఇది తగునా.
చేటు కాలం దాపురించినప్పుడు చెడ్డ మాటలు, చెడు చేతలూ కూడా మనసుకు ధర్మ బద్ధంగానే కనిపిస్తాయి.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి