రాముడు విశ్వామిత్రునికి అంజలి ఘటించి
గురువర్యా తండ్రి గురువు చెప్పిన మాటను
తప్పకుండా నేను పాటిస్తాను స్వామి
ఇప్పుడే తాటాకిని నేను వధించద స్వామి
శత్రు సమర్ధుడైన శ్రీరాముడు
ధనస్సును చేత బూని రాముడు
ధనుష్టంకారమును కావించెను
చక్కని వాడు దశరథ పుత్రుడు
వింటినారీ యొక్క శబ్దానికి
తాటాకి వనవాసులందరూ
భయముతో గజగజ వనికిరచట
తాటాకి భయముతో దిక్కులు చూస్తుంది
శబ్దము వచ్చిన దిక్కు పరువులు తీసింది
వికారమైన రూపుతో వస్తున్నా తాటాకిని
శ్రీరాముడు చూసి లక్ష్మణునికి చూపెనట
ఆ తాటాకి ముక్కు చెవులు ఖండించు లక్ష్మణ
ఆమె అప్పుడు వెనుదిరి వెళ్ళుతుంది
రాముని మాటలు విని తాటాకి గర్జించుచుండెను
రామలక్ష్మణుల పైకి దూకుటకు ప్రయత్నించగా
శ్రీరాముడుతాటాకి చేతులను వధించినాడు
లక్ష్మణుడు తేరుకొని ఆమె ముక్కు చెవులు కోసినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి