శ్రీమద్రామాయణం- బాలకాండం : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వారు ఉడుము చర్మముతో నిర్మితములైన 
తొడుగులను చేతులకు ధరించి 
అర్ధదారులై అపూర్వ శోభతో విరజిల్లుచుండిరి 
నిన్ను ఏ రాక్షసులు కూడా ఏమి చేయలేరు 

బల అతిబల అనే మంత్రములు 
సమస్త జ్ఞానమునకు మాతృకలు 
ఈ రెండు విద్యలు లభించినచో 
నీకు దీటైనవాడు ఎవడు ఉండడు 

పురుషోత్తమ రఘురామ మార్గమందు
బల అతిబల మంత్రమును జపించుచు పయనించు 
నువ్వు లోక కళ్యాణమునకై ఈ విద్యను స్వీకరించుము 
బ్రహ్మ దేవుని నుండి అవిర్బివించినవి

నీవు ధర్మ గుణములు కలవాడవు 
తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను 
రామా నీకు ఉపదేశించినచో 
వివిధ రూపాలలో లోకమంతా విస్తరించునయ్యా 

శ్రీరాముడు ఆ రెండు విద్యలను నేర్చి 
సూర్య భగవానుని వలె విరజిల్లేనట 
రాముడు గురువు పాదాలను నొక్కుగా
విశ్వామిత్రుడు మధురమైన లాలింపు మాటలు చెప్పగా 
తృణశయ్యపై కలిసిపరుండి రచట 


కామెంట్‌లు