నీలి పొరల మాటున
గాలి తెరల వాటున
తేలి వచ్చు వెలుగులే
సోలిన మనసుకు సాంత్వన!
దూర గగన తీరము నుండీ
చేర వచ్చు తొలి కాంతికి
అరవిందముల హారతిచ్చి
ధర పొందెను ఆనందము
అందమైన సుమవనంలో
చిందుతు సుగంధములు
సుందర సుమ బృందములన్నీ
వందనమిడి పలికే స్వాగతం!
చుక్కలు తమ నెలవు వీడి
చక్కగ ఇలపై విరిసి
భువిని దివిగ ఒనరించి
రవికి పలికె ఆహ్వానము!
వెతల చీకటి తోసి
వెలుగు ముగ్గులేసే
వేకువ సమయమంటే
వేడుకేగా మేదినికి!
అంధకారము బాపి
అందని ఆనందమేదో
అందరికీ అందించాలని
ఆగమించు ఆదిత్యునికి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి