కుహూ... కుహూ....
అని కూసింది కోయిల !
నా మదిలో ఊగింది -
ఊహల ఊయల...!
ఎదలో ప్రేమ మల్లెలు పూయ,
నా గుండె తప్పుతున్నది లయ!
ఏమిటో తెలియడం లేదు ఈ మాయ,
నీ తలపులతో _
కోల్పోతున్నాను సోయ !
మనస్సు లో సృష్టిస్తావు అలజడి ,
ఏమీ తెలియనట్లు నటిస్తావు కనబడి ,
నా మనస్సు కదలి వస్తున్నది...
నీ వెంబడి!
తెలుపవచ్చు కదా _
నీ మనస్సు లోని మాట,
వేసుకుందాం _
మన ప్రేమకు పూల బాట ,
ఒకసారి కలుసుకుందాం ,
నీకు నచ్చిన చోట !
పాడి వినిపించవా
ఒక శ్రావ్యమైన పాట ,
మనస్సు తహతహ లాడుతుంది వినాలని నీ నోట !
ఇకనైనా తెలుపరాదా_
మన ప్రేమకు ఆమోదం,
మనమధ్య రానేరాదు విభేదం !
నిన్ను చూస్తే నా మనసుకు కలుగుతుంది ఆహ్లాదం!
అదిగో గుడి లో మ్రోగింది జేగంట,
అదే మన ప్రేమకు దీవెనంట !
నిన్ను చూడకుండా ఉండలేను ఇకఒక్కక్షణం,
ఇక ఎందుకు చెప్పుఆలస్యం !
వచ్చెయ్య రాదా_
నా చెంతకు తక్షణం !!
**

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి