వేగు చుక్క-వెలుగుదివిటి : - నామ వెంకటేశ్వర్లు,- తెలుగు ఉపాధ్యాయులు,-జి. ప. ఉ. పా. అయిటిపాముల
అణగారిన వర్గాల ఆశాజ్యోతి 
పీడిత వర్గాల పితామహుడు 
బడుగు బలహీన వర్గాల బాంధవుడు

అంధ విశ్వాసాలకు ఆజ్యం అజ్ఞానమని 
లోచనచేసి చెత్తగా మూట గట్టి 
 గోతి తీసి పాతరేసిన పారిశుధ్య కార్మికుడు 

ఆటపోటుల సంద్రం లో జంకక నావను దరి చేర్చ 
విశ్వ ప్రయత్నం చేసిన నావికుడులా అసమానతలసమాజాన్ని    
సమానతవైపు కదప సర్వత్రా సాగిపోయిన సారధియతడు 
 
విద్య అందరి సొత్తని
కొందరిది కాదని 
అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన జ్యోతి  వెలిగించిన వెలుగు దివిటి 

ఆడదంటే అబలకాదని 
సబలయని 
వనితలు వంటింటి కుందేలు కానే కాదని     
ఆలి బాలికలలో                            
 అక్షర బీజాలు నాటి మహా వృక్షాలుగా ఎదగ నిచ్చిన 
కృషీవలుడు 

సత్యమును శోధించుటకు 
సత్య శోధక సమాజ సత్రం స్థాపించి 
సమాజమే సర్వస్వమని 
సాగిపోయిన బాటసారి

పూణే లో పుట్టిన మహమ్మారికి 
పీడితులు పిట్టలుగు రాలిపోవునప్పుడు  
ఆదరణ అందని ఆర్థులకు ఆప్యాయత అనురాగాలు 
అందిస్తూనే అంతర్ధానమై అనంతలోకాలకు ఏగిన వేగుచుక్క  

జీవముండగ సత్య శోధక సమాజ బండిని నడుపు భారం 
భార్య, సుతులకప్పగించిన దీర్ఘ దర్శి పూలే


కామెంట్‌లు