వెల్లూర్ జైలుశిక్ష అనుభవించిన ఎందరో తెలుగు మహిళలున్నారు. వారిని గూర్చిన పూర్తి సమాచారం మనకు అందుబాటులో లేదు.అలాంటి వారిలో వావిలాల మాణిక్యాంబ ఒకరు.ఆరోజుల్లో ఆమెను ఊరేగిస్తూ మీటింగుకి తీసుకువెళ్లారు.అక్కడ ఆమె ఇచ్చిన ఉపన్యాసంతో జనాలు ఉప్పొంగిపోయారు.14అక్టోబర్ 1942 లో భర్త నరసింహంతోపాటువెల్లూర్ జైల్లో గడిపారు.చుక్కపల్లి మాణిక్యాంబ క్విట్ ఇండియాలో పాల్గొన్నారు.కోటిపల్లి మాణిక్యాంబ 13సెప్టెంబర్1926 లో పుట్టిన ఆమె దుగ్గిరాల నివాసి.ఆమె తండ్రి వెంకటప్పయ్య,భర్త రామయ్య గార్లు.1942 లో వెల్లూర్ లో శిక్షననుభవించారు. వాసిరెడ్డి నాగమ్మ చేబ్రోలువాసి, భర్త వీరయ్య. 6నెలల జైలుశిక్ష 28జూన్ 1944లో అరెస్టయింది.గడ్డిపాటి రాఘవమ్మ కావూరునివాసి, ఆనాటి రేపల్లె తాలూకాలోని గ్రామం.తండ్రి పున్నయ్య, భర్త వెంకటరత్నం గార్లు.భర్త 1930నుంచి స్వాతంత్య్ర సమరయోధుడు.ఈమె 1942 లో ఆరునెలల జైలుశిక్ష అనుభవించారు.ఇంకా రాయవరపు రాఘవమ్మ, వాసిరెడ్డి రాజ్యలక్ష్మి( చేబ్రోలు) వెల్లూర్ జైలుశిక్ష అనుభవించిన మహిళలు.
1930నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న వనిత సూర్య దేవరరాజ్యలక్ష్మీదేవిగారు.జిల్లాలలో పర్యటించి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడవారిని ప్రోత్సాహించి జైలుకెళ్లేలా సత్యాగ్రహులుగా తీర్చిదిద్దిన మేటివనిత.అండర్ గ్రౌండ్ లో ఉండి1945లో అరెస్టయినా పొలిటికల్ స్కూల్ వనితలకునడిపిన ధీర ఆమె.చేబ్రోలులో కళావెంకట్రావుగారు ప్రారంభిస్తే, అయ్యదేవరకాళేశ్వరరావుగారు ప్రిన్స్ పాల్ గా చేయూత నిచ్చారు.కమలాదేవి చటోపాధ్యాయ,ఎస్.కె.పాటిల్ అందులో వక్తలుగా పాల్గొన్నారు.మునగపాటి రామకోటి పున్నమ్మ 2.10.1942లో 150రూపాయల ఫైన్ తో పాటు జైలుశిక్ష విధిస్తే ఆమె ఫైన్ కట్టనని భీష్మించారు. వెల్లూరులో జైలుశిక్ష అనుభవించిన ఇందుమతీదేవి తణుకులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచినందుకుజైలుపాలైనారు.వీరంతా వెల్లూర్ జైలుశిక్ష అనుభవించినతెలుగు మహిళలు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి