పాలఖండ్యాంలో ఘనంగా బడి పిలుస్తోంది ర్యాలీ

 తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ బడిలోనే చేర్పించి, తద్వారా పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడాలని మండల విద్యాశాఖాధికారి అరసాడ రవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలమేరకు పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో నిర్వహించిన బడి పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ భాగస్వామ్యంతోనే ఊరి బడికి ప్రగతి సాధ్యమౌతుందని అన్నారు. 
పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి మాట్లాడుతూ గుణాత్మక విద్యను అందజేసేలా ఉపాధ్యాయులంతా చేస్తున్న కృషిని గుర్తించి, తమ పిల్లలను చేరువలో ఉన్న మన పాఠశాలలోనే చేర్పించాలని అన్నారు. విశిష్ట అతిథిగా ప్రత్యేక అధికారి, మండల అగ్రికల్చర్ అధికారి బి.బాబ్జీ మాట్లాడుతూ పాఠశాలలోనే త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు ఉందని అన్నారు. తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ బడిలోనే చేర్పించి, తల్లికి వందనం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం వంటి పథకాలతో మిక్కిలి ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. స్థానిక పౌరులు పలిశెట్టి సూర్యనారాయణ, దారబోయన ధర్మరాజు, పులప తిరుమలరావు, వెంపల శివ, పి.వేణు, పెద్ది భాస్కరరావు, కె.వి.సీతారాం తదితరులు పాల్గొని పాఠశాలలో నమోదులు పెంచే దిశగా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి, యెందువ వెంకటరమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎం పెంటయ్య, జిఎంఆర్ విఎఫ్ వాలంటీర్ పిల్లల దాలమ్మలు ప్రసంగించారు. జగన్నాధపురం పాఠశాల ప్రధానోపాధ్యాయని బాలబొమ్మ కుమారి, పంచాయతీ కార్యదర్శి దూబ రంజిత్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎం.హరీష్ కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ వి.శారద, అంగన్వాడీ కార్యకర్తలు కుప్పిలి లక్ష్మి, శాంతి, ఉరిటి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ బడిలో చేరు బంగరు భవితను కోరు, ప్రతి బిడ్డకు విద్య అందరిదీ బాధ్యత వంటి నినాదాలతో గ్రామం పొడవునా భారీగా ర్యాలీ జరిగింది.
కామెంట్‌లు