ఫిడేలు: - కోరాడ నరసింహా రావు!
ఫిడేలు  మూగ బోయింది! 
 మౌన సంధ్యా రాగా లాలాపిస్తోంది...!! 

కురులను సవరించు కోలేదు...! 
 కల్లోల మనసు పరి పరి విధాల తలపులలో పరుగులు తీ స్తోంది...! 

తన గిటార్ను సవరించి... 
తీవెలు చతురతతొ మీటి
 ఆనంద రాగాలు పలికించి... 
  ఉల్లాస సంద్ర0లో మునక లేయించే... 
   నా ప్రియుడు లేక నా ఫిడేలు మూగబోయింది!
 నా లోని చేతనత్వంచచ్చి పొయ్యింది...!! 

ఆతని అకారణ ఆలకలకు 
ఎన్నిమార్లనిబుజ్జగింపులు
ఎన్నెన్ని బ్రతిమ లాటలు !

ఎ న్ని మార్లైనా... తప్పదు
ఆతడు లేనిదే ఈ ప్రాణము నిలువదు... 
 అతడే నా సర్వస్వము! 
 ఆ తని నిరీక్షణలో నా ప్రాణము పోయినా సరే....! 
       *******


కామెంట్‌లు