సామెత -190: ఆకులెత్తరా అంటే విస్తళ్ళు లెక్కపెట్టిండంట
***
"నిజ్జంగా గీడి తెలివంటే తెలివేనే.పుట్టి నేర్శిండో పుట్టక నేర్శిండో గని మాటల్కి తడుముకోడు.బోడిగుండుకి మోకాలికి సుత ముడి పెట్టే రకం".
"ఇంతకీ ఎవలు శెల్లె? గంత తెల్విమంతుడు? అయిన గని గీ దినాల్లో"డబ్బు లేకపోతే డుబ్బుకెట్ల కొరగాడో",తెల్విలేకపోతె మందిల బత్కలేడు."
"గస్మంటి తెల్వి తేటలు మస్తుగ ఉన్నయి గని మరి గీనివి కొన్ని మందిని బురిడీ కొట్టిచ్చే తెల్వితేటలు సుత ఉన్నయి.గదే నా బాదవ్వా!"వొల్లొంగనోడు దొంగల్ల కల్శిండు అంటరు సూడవ్వా! గీడు సుత గదే వీజీ అన్కుంటడు."
"ఇంతకీ ఎవలే వాడు? గాడెవడో గని పేరు శెప్పకుండ గాడ్ని సూడాలన్పిచ్చేటట్టు శేత్తున్నవ్.గంత తీస్ మార్ ఖాన్ ఎవలో శెప్పరాదె శెల్లే!"
"ఎవలో అయితే గింత ఊరిచ్చుకుంట, చప్పరిచ్చుకుంట ఎందుకు శెప్తవ్వా ! మా మన్వడే.సాయం జేసే గుణముందని సంబుర పడాల్నో తెల్వదు. సర్దా అన్కుంట తిక్క పనుల్జేసి శికాకు సేశే రకమన్కోవాలో తెల్వదు"
"గింతకీ! ఏం జేశిండు శెల్లే ? మంచి పనేనా? మన్సు నొప్పిచ్చే పనా?"
"గా మంచిల్నే మన్సు నొప్పిచ్చిండవ్వా! మొన్న ఐతారం పేటలో బిడ్డ ఆడబిడ్డ లగ్గానికి రమ్మంటే బొయినం. గీడు గడియ యిరాం లేక తిరుక్కుంట పనుల్జేత్తుంటే మన్వడు పనిమంతుడని ముర్సిపోయిన."
"ఆడబిడ్డ యియ్యపు రాలోల్లు పెండ్లిపిల్లకి నచ్చిన బట్టలు కొనిపెట్టడానికి వత్తుండ్రని తెల్శిందంట. గీన్ని ఎంత మంది వొత్తుండ్రో తెల్సుకొమ్మని శెబితే గీడు యిష్యం పురాగ తెల్సుకోవాలె గద. గీడు యిస్టైలుగ ఎన్ని కార్లల్ల వొత్తుండ్రని అడిగితే గాళ్ళు మూడని శెప్పిండ్రంట.గా దానికి గీడు ఊయించుకుని కారుకు ఐదుగురు శొప్పున పదేను మందని శెప్పిండంట.
ఇంగ జూస్కో ఆడబిడ్డోళ్ళు మామూలు ఐరాన పడుడు గాదు. శెమటలు గక్కుకుంట, మర్యాదలు తక్వ కావొద్దనుకుంట వొంటా వార్పూ సేశిండ్రంట."
గింతకీ గాళ్ళు ఎంత మందిరి వొచ్చిండ్రో తెల్సా అవ్వా! ఐదుగురు. 'గీడికి శెప్పిందేంది గాడు సేశిందేందనీ' మన్వడిని శెడామడా తిట్టిండ్రంట. నా బిడ్డ ఆడబిడ్డ గామె మొగుడు కల్శి. కార్లు మూడన్నరు గనుక వీడిట్ల లెక్కేశిండు. పెండ్లి పిలగాడు ఓ కారు,గాని అమ్మ నాయిన, అక్కా బావ శెరో కార్లో వొచ్చిండ్రంట."అగ్గో గట్ల శేత్తడవ్వా!"
" ఎన్కటి కెవడో "ఆకులెత్తరా అంటే యిత్తాళ్ళు లెక్కబెట్టిండంట".గట్లనే ఉంది నీ మన్వడి యవ్వారం. అంత మంది వొత్తరనే గద ఇత్తాళ్ళు తెప్పిచ్చింది గవి ఎంగిలి మంగళం గాక ముందే లెక్క బెడ్తే పోలే అన్కుండట. గట్లనే ఉందీ ముచ్చెటి."
"మనోడు సుత మూడు కార్లు అనంగనే గట్లనే ఊయించిండన్న మాట. గిస్మంటివి జూసినప్పుడు గా ఎన్కటి సామెతలు యాదికొత్తుంటయి శెల్లే!
"అవునవ్వా! సుబూధిగ మా మన్వడి లాంటోళ్ళు అగబడ్తుండ్రు గద!"
"గదండీ సంగతి " ఆకులెత్తరా అంటే విస్తాళ్ళు లెక్క పెట్టిండంట"అంటే గిదే మరి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి