పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఐన విశ్వసాహితీ కళా వేదిక నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలకు కవితలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన కవిత టాప్ ట్వంటీ లో నిలిచింది. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు కొల్లి రమావతి ఆధ్వర్యంలో శీర్షిక అను అంశంపై అంతర్జాలం ద్వారా నిర్వహించిన జాతీయ కవితల పోటీలకు తిరుమలరావు పంపిన కవితను ఎంపిక చేస్తూ అభినందన పత్రాన్ని అందజేశారు. అంతర్లీన అక్షర మాలిక అనే కవిత పంపిన తిరుమలరావును అభినందిస్తూ జాతీయ ఛైర్ పర్సన్ కొల్లి రమావతి, రాష్ట్ర మహిళా అధ్యక్ష కార్యదర్శులు జి.భవాని, బోర భారతీదేవి, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పి.పి.వి.అంజనీ కుమారి, జంథ్యాల శరత్ బాబు, షేక్ మహ్మద్ రఫీ ఈవేమన, జట్టబోయిన శ్రీకాంత్, గడల శివప్రసాద్, దొంతు ప్రభావతి, విన్నకోట శివకుమారి, షేక్ పీర్ అయేషాలు టాప్ ట్వంటీ విజేత అభినందన పత్రం పంపారు. అంతర్లీన అక్షర మాలిక కవితలో తల్లిదండ్రులు బిడ్డలకు పేరుపెట్టే భావగీతికే శీర్షిక అని, చలనచిత్ర కథకు సినిమా టైటిలే కీలకమని, సంపుటి సంకలనాలలో గల సారాంశమనేది ఆ పుస్తకం పేరు విషయసూచికలా నిలుస్తుందని, వ్యక్తుల పేరు ముందు బిరుదులవలే ఈ శీర్షిక ఒక నివేదిక అంటూ తిరుమలరావు రచించారు. తిరుమలరావు కవితకు విజేత స్థానం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
విశ్వసాహితి కవితల్లో విజేతగా తిరుమలరావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి