భాగవత ఉపన్యాసం జరుగుతోంది. వెల్లయ్ చ్చామి అక్కడికి వెళ్ళాడు. ప్రవచన కర్త "బాలకృష్ణుడు పూతను హతమార్చాడు. అయిదు తలల నాగాన్ని చంపాడు. కంసుణ్ణి వేధించాడు" అన్నారు.
అప్పుడు వెల్లయ్ చ్చామి లేచి నిల్చుని "భాగవతం నాకు అర్థమైంది" అన్నాడు.
"ఎలాగు?" అని అడిగారు ప్రవచన కర్త.
"నాది బాగం వదమాగవే ఇరుక్కిరదే
(అంటే తెలుగులో అర్థం... సగ భాగం వధించడంగానే ఉందే) " అన్నాడు వెల్లయ్ చ్చామి.
- తమిళంలో వచ్చిన కణ్ణదాసనిన్ తోటత్తు ప్పూకల్" అనే పుస్తకం చదువుతుండగా ఈ ముక్క కనిపించి రాశాను తెలుగులో.
"భాగం వధం": - - యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి