రాజకుమారులతో రెండు నదులను దాటినాడు
దక్షిణ తీరం చేరి వడిగా నడచిరి వారు అడవిలోకి
జనసంచారము లేని అడవిని చూసి రాముడు
ఈ అడవి చీకటిగాఎందుకు ఉన్నదెందుకు
పులులు సింహాలు వరాహములు ఏనుగులు
చండ్రి నల్లమద్ది ఎర్రమద్ది చెట్లతో ఉన్నది స్వామి
చాలా భయంకరంగా ఉంది ఈ అడవి పేరేమిటి
రామా ఈ అడవి ఎవరిదో తెలిపెద వినుము
ఇంద్రుడు వృత్రాసురుని చంపుట వలన బ్రహ్మ పాపము అంటే నట
అపవిత్రుడై ఆకలి దప్పికలతో అలమటించినట
రుషులు చేరదీసి అతని పాపమును తొలగించిరట
నా శరీర మాలిన్యములను గ్రహించిన రెండు ప్రదేశాలు
మలద, కరుశ అను పేర్లతో ప్రఖ్యాతి చెంది
ధనధాన్య సంపదలతో తులతూగుతయని
శక్తి సంపన్నుడైన ఇంద్రుడు ఆ దేశమునకు వరము ఇచ్చెనట
కొంతకాలమునకు వేయి ఏనుగుల బలము గల
కామరూపిణి తాటకాయను యక్షిని జన్మించి
బలశాలి అయిన సుందరుని భార్యగా ఉండే నట
వారికి మారీచుడు అనురాక్షస పుత్రుడు కలిగినాడు
ఈ అడవి పేరు తాటకి వనము అంటారు
దుర్మార్గులైన ఆ రాక్షసులు యజ్ఞభంగము చేస్తున్నారు
రామ నీ బాహుబలముతో వారిని వధించుము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి